ప్రజాశక్తి వి కోట : మండల కేంద్రమైన వీకోటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వి కోట ఎస్సై షేక్ షవలి అందించిన వివరాల ప్రకారం.. శాంతిపురం మండలం వేటగిరి కొత్తూరు కు చెందిన మంజునాథ్ (37), గౌతమి (30) దంపతులు సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో వీకోటకు వచ్చి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. పలమనేర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కుప్పం వైపు వెళ్తూ ప్రమాదవశాత్తు వీకోట పట్టణ నడిబొడ్డులోని సెంటర్ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ అదుపుతప్పి క్రింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకైనది కావడంతో ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు రోడ్డు ప్రక్కనున్న ఆక్రమణలను తొలగించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)