ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గత 2 నెలలుగా తమ గ్రామంలో మంచినీరు రావడం లేదని... మహిళలంతా ఓ పొలానికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించండి మహాప్రభో .. అంటూ అల్లంవారికండిగ గ్రామస్తులంతా మంగళవారం విజ్క్షప్తి చేశారు. మహిళలు మాట్లాడుతూ .... తమ గ్రామంలో రెండు నెలలుగా తాగునీటికి తిప్పలు తప్పడం లేదన్నారు. సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గుక్కెడు తాగునీటి కోసం పక్క పొలంలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నామని వాపోయారు. ఇంత దయనీయస్థితిలో గ్రామస్తులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అల్లంవారి కండ్రిగ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు.
తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించండి మహాప్రభో ..!
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)