ప్రజాశక్తి-కార్వేటినగరం (చిత్తూరు) : డియంపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేరాల ప్రభావతి శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... డియంపురం పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా ఆదర్శవంతంగా పంచాయతీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా పాత డేరా కండిగా నాయుడు ఇండ్లు, డిఎం పురం, డిఎం దళితవాడ గ్రామాలలో ఓటర్లు కర్పూర హారతులు పట్టారు. ప్రభావతికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకడం విశేషం. ఈ కార్యక్రమంలో మేరాల ప్రకాష్, మేరాల సుబ్రహ్మణ్యం, మేరాల స్వప్న జ్యోతి, రేవంత్,ధనం జయ యాదవ్, శేషాద్రి యాదవ్, ఐ వెంకట ముని, నారాయణస్వామి, ఏలుమలై, నాగరాజు, మునరత్నం నాయుడు, దివాకర్ వెంకట ముని, రామకృష్ణ రవి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
జోరుగా ప్రభావతి ప్రచారం
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 04:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)