mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పీఈఎస్ పబ్లిక్ స్కూల్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ స్కూల్ అవార్డు

5 రోజుల క్రితం

Prestigious Green School Award for PES Public School
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిత్తూరు : ఇండియా ఎడ్యుకేషన్ ఎన్‌క్లేవ్ 2026, బిజినెస్ అసెంట్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమంలో పీఈఎస్ పబ్లిక్ స్కూల్, చిత్తూరు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ స్కూల్ అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమం శనివారం నాడు బెంగళూరులోని హయత్ సెంట్రిక్ హోటల్లో ఘనంగా నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా 1000కు పైగా పాఠశాలలను సర్వే చేయగా, వివిధ విభాగాలలో అవార్డులకు 50కు పైగా పాఠశాలలు మాత్రమే అర్హత సాధించాయి. వాటిలో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం వంటి అంశాలలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు పీఈఎస్ పబ్లిక్ స్కూల్ ఈ గౌరవాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.వి. కృష్ణబాబు గారు పాఠశాల తరఫున స్వీకరించారు. పాఠశాలలో చేపడుతున్న వృక్షారోపణ కార్యక్రమాలు, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ పొదుపు చర్యలు, పర్యావరణ విద్య మరియు విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఈ గుర్తింపుకు ప్రధాన కారణమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.వి. కృష్ణబాబు గారు మాట్లాడుతూ …. ఈ అవార్డు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ విజయంపై పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్