ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 19వ తేదీ (గురువారం) నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక,జరుగుతుందని తెలిపారు.బుధవారం మీడియాకు తెలిపిన వివరాలు ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుమండల ప్రత్యేక అధికారి & రిటర్నింగ్ అధికారి ఏ. పుల్లయ్య* ప్రిసైడింగ్ అధికారిగా ఈ సమావేశాలను నిర్వహిస్తారు. కో-ఆప్షన్ సభ్యుని పదవికి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లను పరిశీలించి, మధ్యాహ్నం 12 గంటలకు చెల్లుబాటు అయిన నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1 గంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు జరిగే తొలి ప్రత్యేక సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎంపిటీసి సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక, ఫలిత ప్రకటన, ఎన్నికైన సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే రెండో ప్రత్యేక సమావేశంలో ముందుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి, అనంతరం ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు .
వెదురుకుప్పంలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం .. ఎంపీడీవో పురుషోత్తం
18 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)