ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్.రాజన్ కుమారుడు సిఆర్.తేజ హీరోగా నటించిన అమరన్ తమిళ చిత్రం చిత్తూరు నగరంలోని విజయలక్ష్మి థియేటర్ లో శుక్రవారం ప్రదర్శించారు. తమ పార్టీ ముఖ్య నాయకులు సి ఆర్ రాజన్ కుమారుడు హీరోగా నటించిన తమిళ చిత్రాన్ని చూసేందుకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కాజూరు బాలాజీలతోపాటు వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు అడ్వకేట్ త్రిమూర్తి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ .... సి ఆర్ తేజ సహజ సిద్ధ నటన పలువురిని ఆకట్టుకునేలా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తేజ తెలుగు, తమిళ చిత్ర సీమలో మంచి గుర్తింపు తెచ్చుకొనే నటుడిగా ఎదుగుతారు అన్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా నుండి తమిళ చిత్ర హీరోగా మంచి చిత్రంలో నటించిన తేజను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించారు. తమ పార్టీ నాయకులు, జిల్లా వాసులు అభిమానులతో కలిసి తాను నటించిన చిత్రం చూడటం ఎంతో ఆనందంగా ఉందని హీరో తేజ తెలిపారు.
చిత్తూరులో తమిళ సినీ హీరో తేజ సందడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 02:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)