శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తల్లిని మించిన యోధులు లేరు ...

20 నవంబర్, 2026

chittoor.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉద్యోగ బాధ్యతలు ఒక ప్రక్క... బిడ్డ బాధ్యత మరొక ప్రక్క...

ఉద్యోగ నిర్వహణలో అలుపు ఎరగని పోరాటం...

ఓ సచివాలయం ఉద్యోగి నడక ప్రయాణం..

ప్రజాశక్తి -చిత్తూరు : ‘‘తల్లిని మించిన యోధులు లేరు’’ సినిమాలో డైలాగు విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఎక్కడ చూసినా ఈ పదమే నానుడి... దీనిని నిజం చేస్తూ ఓ సచివాలయం ఉద్యోగి, బిడ్డ ఆలనా పాలన చూస్తూ పోరాటం చేస్తుంది. ఆమె కథను పాఠకులకు తెలిపే ప్రయత్నంలో ప్రజాశక్తి.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురు కుప్పం మండలం, మాంబేడు సచివాలయం ఉంది. మండలంలోని అతిపెద్ద పంచాయతీలలో ఈ పంచాయతీ ఒకటి. రెవిన్యూ గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అక్కడికి స్థానికులు వస్తుంటారు. వారికి సమాధానం చెబుతూ... బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ ఉద్యోగం సాగిస్తోంది హారిక. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఉంది. ఆమెకు 2020 డిసెంబర్‌ 7న సచివాలయ ఉద్యోగం వచ్చింది. పచ్చికాపల్లంలో ఉద్యోగ బాధ్యతలు తీసుకుంది. 27 4 2024లో కుమారునికి జన్మనిచ్చింది. పేరు యూవష్ . ఐదు నెలలు మాత్రమే ఇంటి దగ్గర ఉండి, అనంతరం ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది. తల్లి పొత్తిళ్లలో చంటి బిడ్డ ను ఎత్తుకొని అప్పటినుంచి తన బిడ్డను సచివాలయంలో కమ్మికి ఊయల కట్టి , బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు ఇస్తూ, ఆడిస్తూ వచ్చినవారికి ఇబ్బందులు లేక పనులు చేస్తూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం బదిలీపై మాంబేడు సచివాలయానికి వచ్చారు. అక్కడ కూడా అదే విధంగా చంటిబిడ్డ ఆలనాపాలనా చూస్తూ విధులు నిర్వహిస్తున్నారు. చంటి బిడ్డ అల్లరి ఏ విధంగా ఉంటుందో తెలియంది కాదు. ఆమె జీవితం పలువురికి ఆదర్శంగా ఉండాలని, నిబద్ధతతో ఉద్యోగం చేస్తూ ముందుకు సాగాలని పలువురు ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్