mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రంధాలయ సేవలు పాఠకులకు త్వరితగతిన అందాలి

09 జూన్, 2026

kkd-9 రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కే జే ఎస్ ఎల్ కుమారి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 06:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి-కాకినాడ :

గ్రంథాలయ సేవలు పాఠకులు కోరిన వెంటనే త్వరితగతిన అందేలా గ్రంథ పాలకులు చూడాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కే జే ఎస్ ఎల్ కుమారి అన్నారు. కాకినాడ గాంధీనగర్, (వివేకానందా పార్క్) శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కేజే ఎస్ ఎల్ కుమారి మంగళవారం ఆకస్మిక సందర్శన చేశారు.


ఈ సందర్భంగా కార్యదర్శి గ్రంధాలయ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠకులకు కోరిన పుస్తకములు గురించి తెలియచేయటం , వారి సమయాన్ని వృధా కాకుండా కావలసిన పుస్తకాలను అందించాలన్నారు. స్థానిక సంస్థలు గ్రంథాలయ సంస్థకు చెల్లించవలసిన గ్రంధాలయ సెస్సు వసూలు చేయుట పట్ల సూచనలు చేయుట జరిగింది. అలాగే గ్రంధాలయ ఆవరణలో పాఠకుల సౌకర్యార్థం సౌచాలయం ఏర్పాటు గురించి కాకినాడ నగర పాలక సంస్థ వారిని సంప్రదించవలసిందిగా తెలియచేశారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్