- జిల్లా ఇమ్యునైజేసన్ అధికారి శ్రీదేవి
ప్రజాశక్తి- రాజమహేందవరం : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం హెల్త్ అండ్,ఐసిడిఎస్ సంయుక్తంగా సుబ్బారావు పేట షాది ఖానా లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎం అండ్ హెచ్ ఓ పి.కోమలి పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, యుపీ హెచ్ సి అభివృద్ధి కమిటీ చైర్మన్ అనసూరిశ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
జిల్లా ఇమ్యునైజేసన్ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ తల్లిపాలు ఆరు నెలల వరకు బిడ్డకు తాగించాలని, బాలింతకు సమతుల్యమైన ఆహారం అందించాలన్నారు.
తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్య రక్షణ :
డాక్టర్ ఎం.కృష్ణ అనూహ్య మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు ఇవ్వడం వలన పూర్తి ఆరోగ్య రక్షణతో ఎదుగుదల జరుగుతుందని తెలిపారు. తల్లిపాల వలన శిశువుకు రోగ నిరోధక శక్తి, జీర్ణ ప్రక్రియ మెరుగుదల అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ డి. భవాని ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, హెల్త్ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)