ప్రజాశక్తి-అనపర్తి (తూర్పు గోదావరి) : రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి 11 మంది విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఒకే పాఠశాల నుండి ఇంతమంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడంపై మండల విద్యాశాఖ అధికారి నల్లమిల్లి సత్తిరెడ్డి ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, ప్రతిభ చాటిన విద్యార్థులను స్వయంగా అభినందించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ... తూర్పుగోదావరి జిల్లా స్థాయిలోనే మొత్తం 34 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికై అనపర్తి మండలం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని గర్వంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో జరిగిన పదవ తరగతి ప్రభుత్వ పరీక్ష ఫలితాలలో కూడా అనపర్తి మండలం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుని అగ్రగామిగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నేషనల్ స్కాలర్‌షిప్‌లలో అనపర్తి సరికొత్త రికార్డు - జిల్లాలోనే ప్రథమ స్థానం
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)