- కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి
ప్రజాశక్తి-గోపాలపురం: రెండు రోజులుగా గోపాలపురం మండలంలో సంచరిస్తూ పెద్దపులి పశువులపైన దాడులకు తెగబడడంతో ప్రజలకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. బుధవారం తెల్లవారుజామున గుడ్డిగూడెం పొలాల్లో ఒక దూడపై దాడి చేసింది. దానిని కొన ప్రాణంతో ఉన్న దూడను అక్కడే వదిలిపెట్టి బుచ్చియ్యపాలెం-కరగపాడు అటవీ ప్రాంతంలోకి ప్రయాణిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం గోపాలపురం మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి మంగళవారం గోపాలపురం శివారు బొల్లేరు చెరువు వద్ద దూడను చంపి కొబ్బరి తోటలోకి లాక్కెళ్ళింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ దూడను తిని ఆరగించింది. అనంతరం కొబ్బరి తోటలో అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆ పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అటవీశాఖ సిబ్బంది నుంచి రాత్రి కొన్నుగప్పి తప్పించుకుంది. గోపాలపురం మండలంలో వచ్చిన దారిలోనే ప్రయాణం కొనసాగిస్తుంది. ప్రస్తుతం మండలంలోని బుచ్చియ్యపాలెం-కరగపాడు పరిసర ప్రాంతాల్లో ఉందని తెలిపారు. శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమన్ టీం, ఉభయగోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. పరిసర గ్రామ ప్రజలు, అటువై ప్రాంతంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని మైక్ ప్రచారం జరుగుతోంది.







కామెంట్‌లు (0)