- విజేతలకు సర్టిఫికెట్ల పంపిణీ
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ : శంభునగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) పరిధిలో జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ మనంద్ చంద్ర మాట్లాడుతూ శారీరక, మానసిక ఎదుగుదలకు అయోడిన్ ఎంతో అవసరమని తెలిపారు. అయోడిన్ లోపం వల్ల గాయిటర్, థైరాయిడ్ సమస్యలు, పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిపిన ఉప్పును వినియోగించాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు డాక్టర్ ఆనంద్ చంద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)