ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : అయోడిన్ ప్రాముఖ్యత, లోపం వల్ల వచ్చే వ్యాధులపై ఆనందనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో యూపీహెచ్‌సీ ఆనందనగర్ ఆధ్వర్యంలో జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణ కార్యక్రమం (ఎన్ఐడీడీసీపీ) ను వైద్య అధికారి డా. రావి బ్యూలా ప్రియదర్శిని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో అయోడిన్ లోప నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి 7, 8, 9 తరగతుల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వైద్య అధికారి డా. రావి బ్యూలా ప్రియదర్శిని చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డా.ప్రియదర్శిని మాట్లాడుతూ అయోడిన్ మన శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకమని, దీని లోపం వల్ల గాయిటర్, మానసిక, శారీరక ఎదుగుదల లోపాలు, పిల్లల్లో అభ్యసన సామర్థ్యం తగ్గడం వంటి తీవ్ర రుగ్మతలు వస్తాయని వివరించారు. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించారు.
డాక్టర్ ఆర్.బ్యూలా ప్రియదర్శిని ఆధ్వర్యంలో అయోడిన్ లోప నియంత్రణపై అవగాహన
12 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 10:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)