ప్రజాశక్తి – కోరుకొండ : కోరుకొండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు వినియోగానికి అనువుగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా మరుగుదొడ్లకు ఇరువైపులా పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించడంతో మహిళలు వాటిని వినియోగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుకాణాల వద్ద నిత్యం రద్దీగా ఉండటంతో మహిళలు మరుగుదొడ్లకు వెళ్లేందుకు సంకోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్ల చుట్టూ ఉన్న దుకాణాలను తొలగించి, మహిళలకు సౌకర్యవంతంగా మరుగుదొడ్లను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.
మహిళలకు అందుబాటులో లేని బస్‌స్టాండ్ మరుగుదొడ్లు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 09:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)