సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద నీటిలో కొట్టుకుపోయిన కారు .. తప్పిన పెను ప్రమాదం

2 రోజుల క్రితం

Car washed away by floodwaters; major tragedy averted.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కోరుకొండ మండలంలో భారీ వర్షాల ప్రభావం.. జేసీబీతో కారును బయటకు తీసిన గ్రామస్తులు


ప్రజాశక్తి – కోరుకొండ (తూర్పు గోదావరి) : కోరుకొండ మండలంలో భారీ వర్షాల కారణంగా ఓ కారు కాలువలోకి కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం గాదరాడ నుంచి కొనుపూరు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వరద నీరు రావడంతో కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గాదరాడ–కొనుపూరు మార్గంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో కారు అదుపుతప్పి కాలువలోకి పడిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో కాలువలో పడిపోయిన కారును బయటకు తీశారు. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి ఉన్న సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్