ప్రజాశక్తి-చాగల్లు : అక్టోబర్ నెలలో జరిగిన జిల్లా స్థాయి అండర్ 19 హాకీ ఎంపికలలో చాగల్లు విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారని పిడి జే విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వాళ్ళలో ఎన్.మనోజ్ కుమార్, కే.కోమల్ కుమార్, జై ది పవన్, బాలికల విభాగంలో జి.సింధు, ఎం.భవాని, డి.కృష్ణ శైలజ, బి.హేమ నవ్య వి.శాంతిలు ఎంపికయ్యారని తెలిపారు. ఈనెల 14నుండి 17వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరుగునున్న రాష్ట్రస్థాయి పోటీలో వీరందరూ పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన వాళ్లను హెచ్ఎం ఎస్ వాసవి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తుల అభినందించారు.
అండర్ 19 రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు చాగల్లు విద్యార్థులు
12 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 10:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)