మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

4 రోజుల క్రితం

Conclusion of Library Week Celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 01:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు మండలం చాగల్లు-శాఖా గ్రంధాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవముల సందర్భంగా శుక్రవారం అక్షరాస్యత దినోత్సవం  ముగింపు సమావేశానికి  చాగల్లు మండలం తాసిల్దార్ ఎం. కమల్ సుందర్  చాగల్లు మండలం ఎంఈఓ 1 జె. సత్యానంద్, ఎంఈఓ 2 హెచ్. సుభకర్ తాాళ్లూరు వెంకట రామారావు డాక్టర్ ఆలపాటి సాంబశివరావు ,దొడ్డ వెంకట్రావు, రాజరాజేశ్వరి విద్యాలయ డైరెక్టర్ వి. వెంకట రామారావు పాఠకులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వ్యక్తులను విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకుని గ్రంథాలయానికి వచ్చే అలవాటును నిత్య కృత్యంగా మార్చుకోవాలని అన్నారు. ఎంఈఓ 1 సత్యానంద్ మాట్లాడుతూ మేధావులందరూ పాఠశాల విద్యతోపాటు గ్రంథాలయ పఠనంతో మాత్రమే వారు గొప్ప వ్యక్తులుగా తయారయ్యారని తెలిపారు  ఎంఈఓ 2 శుభకర్  మాట్లాడుతూ విద్యార్థులందరూ పాఠశాల విద్యతోపాటు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పత్రికలను చదవడం అలవాటుగా మార్చుకోవాలని  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడటం జరిగినది ఈ కార్యక్రమంలో అధికారులు చదువరులు ఉపాధ్యాయులు గ్రామస్తులు  విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 14 నుండి 20వ తారీకు వరకు జరిగిన వారోత్సవాల్లో వివిధ పోటీలను విద్యార్థులకు నిర్వహించిన  పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అధికారుల చేతుల మీదుగా అందించారు . ఈ కార్యక్రమం గ్రంథ పాలకురాలు  సిహెచ్ వెంకట జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్