ప్రజాశక్తి - చాగల్లు : తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం శనివారం మండలంలోని మార్కొండపాడు, దారవరం గ్రామాలలో పరిశీలించింది. మండలంలో 8,500 ఎకరాలలో వరి సాగు చేయగా, తుపానుల వల్ల సుమారు 5,560 ఎకరాలలో పంట తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. మార్కొండపాడులో 751.52 ఎకరాలు, దారవరంలో 562.50 ఎకరాలలో నీట మునిగిన పొలాలను పరిశీలించిన బృందం బాధిత రైతులతో మాట్లాడింది. ఎకరాకు రూ. 35 వేల పెట్టుబడి పెట్టామని, చేతికొచ్చే దశలో పంట పూర్తిగా దెబ్బతిందని, పొలాలను బాగు చేయడానికి అదనంగా రూ. 5 వేల వరకు ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్.శ్రీనివాస్, ఎంఎఒ కె. వేణుగోపాలకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన పరిశీలించిన ఢిల్లీ సెంట్రల్ టీం
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 06:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)