గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆహ్లాదం పంచేలా పార్కుల అభివృద్ధి

2 గంటల క్రితం

parks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్యాకేజీ -4 లోని పార్కులను పరిశీలించిన కమిషనర్

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేలా.. పార్కుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలసి ప్యాకేజీ-4లోని పార్కులను పరిశీలించారు. సాయిచైతన్య నగర్ పార్క్, సుబ్రహ్మణ్య నగర్ పార్క్, హార్లిక్స్ ఫ్యాక్టరీ లేఅవుట్ పార్క్, అల్యూమినియం ఫ్యాక్టరీ లేఅవుట్ పార్క్ లను సందర్శించి.. ప్రణాళికాబద్దంగా, ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది వాకింగ్ చేయడానికి అనుకూలంగా, ఇతరులను దాటుకుని వెళ్లడానికి తగినంత స్థలం ఉండేలా వాకింగ్ ట్రాక్ లను విశాలంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పార్కులోనూ కనీస వసతులు ఉండేలా చూడాలని.. త్రాగునీరు, టాయిలెట్లు, లైటింగ్, ప్రహరీ, గేటు, సేదదీరడానికి బెంచీలు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. అలాగే పార్కు విస్తీర్ణం, అనుకూలతను బట్టి షటిల్ కోర్టు, జిమ్ పరికరాలు, పిల్లల ఆట పరికరాలు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి వేళల్లో పార్కు సురక్షితంగా ఉండేందుకు విద్యుత్ దీపాలు ఉండాలన్నారు. అదేవిధంగా ప్రజలను భాగస్వాములను చేసి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఈఈ మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, డీఈ లోవరాజు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్