వాహనదారులకు తప్పని ప్రమాదం.. పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి – కోరుకొండ (తూర్పు గోదావరి) : కోరుకొండలో ప్రధాన రహదారిపై వీధికుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఒకేసారి పెద్ద సంఖ్యలో కుక్కలు తిరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కుక్కలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కూడా కుక్కలు అక్కడే గుంపులుగా చేరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు రహదారి పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు. వాహనదారులకు ప్రమాదాలు జరగకముందే అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.








కామెంట్‌లు (0)