ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : ప్రతిష్ఠాత్మకమైన శక్తీ సాట్ (ShakthiSAT) కార్యక్రమానికి ఎంపికైన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవలేశ్వరం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సి నేడు టీడీపీ యువ నేత, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవి రామ్ కిరణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. గోరంట్ల రవి రామ్ కిరణ్ కందుల జెస్సికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన ఈ ఘనత రాజమహేంద్రవరం నియోజకవర్గానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా డా. గోరంట్ల రవి రామ్ కిరణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని కందుల జెస్సి నిరూపించిందన్నారు. విద్యార్థులకు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు. కందుల జెస్సి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ (GSR Foundation) ద్వారా కందుల జెస్సి విద్యాభ్యాసం, భవిష్యత్ ప్రయాణానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ప్రకటించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని, ఇలాంటి విద్యార్థులకు మద్దతుగా నిలవడం ద్వారా ఎందరికో స్ఫూర్తినివ్వాలనే లక్ష్యంతో జీఎస్‌ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ్మిశెట్టి. పద్మ జ్యోత్స్న , ఎంఈఓ తులసిదాస్ , విద్యార్థిని తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. కందుల. జెస్సి విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల శ్రీను, మరియు అరుణ కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఆమెకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
శక్తీ సాట్‌కు ఎంపికైన కందుల జెస్సిని ఘనంగా సత్కరించిన డా. గోరంట్ల.రవి రామ్ కిరణ్
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 03:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)