గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

29న పాఠశాల యాజమాన్య కమిటీల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు

15 సెప్టెంబర్, 2026

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్. సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన SMC మార్గదర్శకాలు 2026 ఆధారంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో SMC పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల ప్రక్రియ దిగువ తెలిపిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు

15.09.2026 - SMC సభ్యులు, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల, పత్రికా ప్రకటన జారీ.

18.09.2026 - పాఠశాల నోటీసు బోర్డు పై ఓటర్ల జాబితా ప్రదర్శన మధ్యాహ్నం 2.00 గంటలకు.

25.09.2026 - ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు. తుది ఓటర్ల జాబితా ఖరారు, ప్రదర్శన మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 4.00 వరకు.

29.09.2026 - SMC సభ్యుల ఎన్నిక నిర్వహణ మరియు ఖరారు ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక మధ్యాహ్నం 1.30 గంటలకు. ప్రమాణ స్వీకారోత్సవం మధ్యాహ్నం 2.00 గంటలకు. నూతన SMC మొదటి సమావేశం మధ్యాహ్నం 3.00 నుండి 3.30 వరకు.


ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఆయా మండలాల మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్. సుభాషిణి సూచించారు.అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అలాగే ప్రైవేటు పాఠశాలలు కూడా SMC లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్