ప్రజాశక్తి –రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గర్ల్స్ హైస్కూల్‌తో పాటు మెయిన్‌రోడ్డులోని స్వర్ణ పంచాయితీ–1లో నామినేషన్లను సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రెండు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. కేంద్రాల పరిసరాల్లో భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియకు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)