గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలమూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

1 గంట క్రితం

eg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 02:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనపర్తి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలోని దత్త నాగ సాయి ఆనంద ఆశ్రమంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సత్తి విమల దేవానంద బాబా ఆధ్వర్యంలో ప్రముఖ కంటి వైద్య నిపుణుల సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన పలువురు రోగులను గుర్తించి, వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. వృద్ధులు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఉచిత వైద్య సేవలు ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు సత్తి దేవానంద్ రెడ్డి (బాబా), సత్తి సత్యనారాయణ రెడ్డి, సత్తి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎన్.ఎస్. చలం, కాకరపర్తి మణికంఠ, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్