మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

4 రోజుల క్రితం

Library Week celebrations conclude
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి) : ఈ నెల 14 నుండి ప్రారంభమైన 59వ,జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు నేడు శుక్రవారం తో ముగిసాయి. మండల కేంద్రం కపిలేశ్వరపురం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారిణి దానేటి శివకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ లో జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వంగా శ్రీనివాస్, పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు . ఈ వారం రోజులు పాటు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన క్విజ్, తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. పోటీ పరీక్షలు లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్దులకు బహుమతులు, జ్ఞాపికలను పాఠశాల హెచ్ఎం వంగా శ్రీనివాస్ తో పాటు పలువురు చేతుల మీదుగా అందజేశారు . ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాలుకు వెళ్ళి పుస్తక పఠనం అలవర్చుకొని,తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గ్రంథాలయాలును విద్యార్దులకు పరిచయం చేయాలనే సదుద్దేశంతోనే గ్రంథాలయ వారోత్సవాలు, వేసవి శిక్షణ శిబిరాలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించి, వారిని భాగస్వామ్యం చేస్తున్నారని, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా పోటీ పరీక్షల లో ఉత్తమ ఫలితాలు ఉన్నత ఉద్యోగాలు సాధించుకో వచ్చని విద్యార్దులకు వివరించారు. కార్యక్రమంలో పాస్టర్ ఏసు రత్నం, చిట్టూరి నాగేంద్రప్రసాద్,గ్రంథాలయ పాలకురాలు డి శివకుమారి, రూతు రత్నమణి భ్రమరాంబ, గ్రంథాలయ పాలకులు, ఉపాధ్యాయులు, విద్యార్దులు, తదితరులు, పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్