మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే వేగుళ్ల, లీలాకృష్ణ ఇష్టాగోష్టి

6 రోజుల క్రితం

mandapeta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 01:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మండపేట: ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో మండపేట మండల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే వేగుళ్ల, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ కలిసి ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఈ నెల 19వ తేదీన జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై ఎంపీటీసీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండపేట మండల జడ్పీటీసీ నల్లమిల్లి వీర్రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్