ప్రజాశక్తి- గోకవరం : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కేంద్రమైన గోకవరంలో నూతన వంతెన నిర్మాణం, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన కూడలిలోని మాదిగ సంఘం, ఎమ్మార్పీఎస్, బాబూ జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన స్థలం ప్రభావితమవుతున్న నేపథ్యంలోఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో కమ్యూనిటీ హాల్ స్థలం సేకరిస్తే తగిన నష్టపరిహారం అందించాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని వారు కోరారు. అలాగే చర్మకారులు, డప్పు కళాకారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు మాదిగల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వినతిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు చీకట్ల వెంకటేష్, మోర్తా చిట్టిబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చీకట్ల రాజు, స్టూడియో బూత్ కన్వీనర్ బొట్టా రామకృష్ణ, తంటికొండ టీటీడీ డైరెక్టర్ గున్నూరు చంటి, సీనియర్ నాయకులు పెరవలి పండు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మోర్తా డానియల్, స్టూడెంట్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎమ్మార్పీఎస్ నాయకుల వినతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)