గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాను బాధితులను ఆదుకోవాలి : సిపిఐ(యం)

2 గంటల క్రితం

CPI(M) State Committee strongly condemns illegal arrests of Gannavaram Airport residents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 12:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : అర్నబ్ తుఫానుకు అతలాకుతలమైన ప్రజలు, రైతాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం సంతృప్తికరంగా లేదన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించినా వివిధ ఘటనల్లో 9 మంది మరణించారని తెలిపారు. మృతులకు సిపిఐ(యం) సంతాపం, క్షతగాత్రులకు సానుభూతి ప్రకటిస్తున్నదన్నారు. ఇది సాధారణ తుఫాను కాదనీ, పైగా ఎల్‌నినో ప్రభావంతో పంటలు వేయక లేదా ఎండిపోయి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. కూలీలకు పనిలేదనీ, కౌలు రైతులు పెట్టుబడి పెట్టి, ముందస్తు కౌలు కట్టి దారుణంగా నష్టపోయారని తెలిపారు. వృత్తిదారులకు ఈ తుఫాను వల్ల ఉపాధి పోయిందని చెప్పారు. అతివృష్టికి అనావృష్టికి తోడు ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యిందని అన్నారు. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తుఫాను బాధిత ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు ఒక నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. అలాగే మరణించినవారికి రూ.25 లక్షలు, మునిగిపోయిన ఇళ్ళకు రూ.25 వేలు, చేనేత, మత్స్యకార్మికులు, చిన్న దుకాణ దారులకు రూ.50 వేలు చొప్పున, ఆటో కార్మికులు, తోపుడు బండ్లకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని కోరుతున్నదన్నారు. పంటలకిచ్చే సహాయాన్ని ఆహార పంటలకు కనీసం ఎకరాకు రూ.25 వేలకు తగ్గకుండా పెంచాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన పరిహారాన్నే ఇప్పటికీ కొనసాగించడం సమ్మతం కాదన్నారు. ఉద్యానవన పంటలకు, కూరగాయల పంటలకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు, పసుపు, అరటి, పూలతోటలు, తమలపాకు తదితర పంటలకు రూ.1 లక్ష వరకు ఇవ్వాలన్నారు. పడిపోయిన కొబ్బరి చెట్టుకు రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.15 వేలు ఇవ్వాలన్నారు. కౌలు రైతులను గుర్తించి సహాయం వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు మళ్లీ పంటకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, రుణ సదుపాయం కల్పించాలన్నారు. పాత రుణాలకు వడ్డీ లేకుండా రీ షెడ్యూలు చేయాలన్నారు. పొలాల్లో చేరిన నీరు తక్షణం తీసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనులు కల్పించి బకాయిలు లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ కార్మికులకు పనిలేనందున ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున అదనపు సహాయం చేయాలన్నారు. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా భరించాలన్నారు. కేంద్రం పై రాష్ట్ర ప్రభుత్వానికున్న పలుకుబడిని ఉపయోగించి తుఫాను, కరువు సహాయార్థం లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని సాధించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim letter

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్