మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీగా తగ్గిన పంట దిగుబడి

3 రోజుల క్రితం

భారీగా తగ్గిన పంట దిగుబడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గోపాలపురం : తుపానుల ప్రభావంతో వరి, మినుముల దిగుబడి బాగా తగ్గిందని పంట కోత ప్రయోగంలో గుర్తించినట్లు కొవ్వూరు ఉపగునంక అధికారి జయ భారతి తెలిపారు. శుక్రవారం మండలంలోని భీమోలులో రైతులు పోతుల శ్రీనివాసరెడ్డి, ముళ్ళపూడి జ్యోతి పొలాల్లో ఎంటియు 24 వరి సంపత్ స్వర్ణ రకాల వరి పంట కోత ప్రయోగాలను నిర్వహించారు. ఎకరాకు 35 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా 22 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చిందని ఆమె తెలిపారు. ఎఎస్ఒ జోడాల వెంకట్ మాట్లాడుతూ మండలంలో 4122 హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారన్నారు. మండలంలో మొత్తం 60 పంట కోత ప్రయోగాలను చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 24 ప్రయోగాలు పూర్తి చేశామని తెలిపారు. డిసెంబర్ 15 లోపు మిగిలిన ప్రయోగాలు పూర్తి చేస్తామన్నారు. మినుములు 32 హెక్టర్లలో సాగు చేశారన్నారు. ఇప్పటికీ నాలుగు ప్రయోగాలు పూర్తి చేశామన్నారు. ఎకరాకు 6 నుండి-8 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా 2 నుంచి 3 బస్తాల వరకు మాత్రమే దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతిరావు, వ్యవసాయ సహాయకులు మణికంఠ స్వామి, సత్తార్ జానీ రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్