సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై కఠిన చర్యలు : ఎంఈఒ సుబ్రహ్మణ్యం

1 గంట క్రితం

ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై కఠిన చర్యలు : ఎంఈఒ సుబ్రహ్మణ్యం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం అర్బన్ మండల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఎమ్ వి ఎమ్ సుబ్రహ్మణ్యం సోమవారం ఒక ప్రకటన లో హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కంది వాసుదేవరావు ఆదేశాల మేరకు ఈ అంశం పై పలు సూచనలు జారీ చేశారు. మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ గుర్తింపు ఉత్తర్వులు లేకుండా ఎలాంటి తరగతులు నిర్వహించకూడదన్నారు. ఏడో తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, తదుపరి ఉన్నత తరగతుల నిర్వహణకు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా క్లాసులు నడపరాదన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా, నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు లేదా అదనపు తరగ తులు నిర్వహిస్తే సదరు పాఠశాలల గుర్తింపును రద్దు చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఒ స్పష్టం చేశారు. అలాగే.. పాఠశాల ప్రాంగణం లో బుక్స్, యూనిఫామ్ వంటివి అమ్మరాదన్నారు. ప్రైవేటు పాఠశాల ల విషయంలో తల్లిదండ్రులు తమ సమస్యను రాత పూర్వకంగా తమ దృష్టికి తేవాలని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్