బురద, చెత్తను లెక్కచేయకుండా డ్రైనేజీల శుభ్రత
ప్రజాశక్తి – కోరుకొండ (తూర్పు గోదావరి) : కోరుకొండ మండలం జబ్బుపట్నం గ్రామంలో వర్షాల కారణంగా గ్రామ వీధుల్లో నిలిచిపోయిన వరద నీటిని తొలగించేందుకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో బురద, చెత్తను లెక్కచేయకుండా డ్రైనేజీలను శుభ్రం చేస్తూ నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగిస్తున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పూడికను తొలగిస్తూ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.








కామెంట్‌లు (0)