ప్రజాశక్తి – కోరుకొండ : మండలంలోని కోరుకొండ కోనేరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ నుంచి రాజమహేంద్రవరం వైపు ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఉదయం సుమారు 5 గంటల సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సోడసాని ప్రసాద్ (40) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
ఇటుక లోడు ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)