మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

4 రోజుల క్రితం

Two young men die in a road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 11:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కోవూరు (తూర్పు గోదావరి) : కోవూరు సమీపంలోని ఇంద్రలోక్ అవెన్యూ తూర్పు వైపున జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు డివైడర్‌ను మోటార్ బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. విడవలూరు మండలం వెంకటనారాయణపురానికి చెందిన సుబ్బు, వంశీ, దినేష్ ముగ్గురు యువకులు మోటార్ బైక్‌పై జువ్వలదిన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా కోవూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బు, వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, దినేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్