ప్రజాశక్తి - సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ వాలీబాల్ జిట్లా జట్టు ఎంపిక పోటీల్లో సామర్లకోట మండలం వేట్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్-14 బాలుర విభాగంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఇ.దుర్గాప్రసాద్, అండర్-17 బాలికల విభాగంలో పి.లిఖిత ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో స్థానం సంపాధించారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల హెచ్ఎం అనురాధ, విద్యా కమిటీ చైర్పర్సన్ సిహెచ్. సత్యవేణి, టిడిపి నాయకులు గుమ్మల రామకృష్ణ, గోలి శ్రీరామ్, మాజీ ఎంపిపి కొండపల్లి కృష్ణమూర్తి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ శివ తదితరులు అభినందించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి ఎంపికకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు యార్లగడ్డ బంగార్రాజు, ఇబ్రహీం, శ్రీనివాసులను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
బీచ్ వాలీబాల్ జట్టుకు వేట్లపాలెం విద్యార్థుల ఎంపిక
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)