పిఎసిఎస్ వద్ద వినాయక మండపం ఏర్పాటు.
డిపాజిట్ దారుల పూజలు....
ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : ది సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుండి తమకు చెల్లించాల్సిన డిపాజిట్ల సొమ్మును ఇప్పించాలని, వినాయకుడిని వేడుకుంటూ పిఎసిఎస్ వద్ద, సోమవారం బాధితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సొసైటీ ప్రాంగణంలో వినాయక విగ్రహం వద్ద ' వినాయకా మా డిపాజిట్లు తిరిగి ఇప్పించాలి ` అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నవరాత్రి ప్రారంభోత్సవాల రోజు సోమవారం నాటికి బాధితులు నిర్వహిస్తున్న నిరసన దీక్ష 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించారు. విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, డిపాజిట్లు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. మంచం మీదనే పడుకున్న వృద్ధుడు, చిట్టూరి నరసింహమూర్తితోపాటు తాటిపర్తి ఆనందరావు, తాటిపర్తి వెంకట్రావు, నాగోతు వెంకట సత్యనారాయణ, నాగోతు వరలక్ష్మి, పెదపోలు సుబ్బారావు, సింహ గనిరాజు, నిమ్మగడ్డల గంగాభవాని, నిమ్మగడ్డ సన్నీ, యార్లపాటి సుబ్బమ్మ తదితర బాధితులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)