సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10వ రోజుకు విఆర్‌ఎల సమ్మె

2 రోజుల క్రితం

10వ రోజుకు విఆర్‌ఎల సమ్మె image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -అనపర్తి : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఆర్ఎలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. అనపర్తి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలో విఆర్‌ఎలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. విఆర్‌ఎలకు తక్షణమే పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు. అర్హత కలిగిన వారికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సీనియారిటీ ఆధారంగా ఆఫీస్ అటెండర్, నైట్ వాచ్‌మ్యాన్ తదితర కేడర్లలో అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎ సంఘం మండల అధ్యక్షులు దండ కడియాల సత్యనారాయణ, కార్యదర్శి లంకరాజు, ఉపాధ్యక్షులు షేక్ షా బాషా, కోశాధికారి పి.బాలాజీ, గౌరవ అధ్యక్షులు ఎల్.రామారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్