మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సచివాలయ ఉద్యోగులపై దాష్టికం తగదు: మాజీ ఎంఎల్‌ఏ జక్కంపూడి రాజా

9 గంటల క్రితం

సచివాలయ ఉద్యోగులపై దాష్టికం తగదు
మాజీ ఎంఎల్‌ఏ జక్కంపూడి రాజా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 07:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

​గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికంగా వ్యవహరిస్తోందని వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఎ జక్కంపూడి రాజా విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని సంహిత కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. మహిళా ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారని, ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ఉద్యోగులను కొన్ని మీడియా సంస్థలు ‘బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌, పోరంబోకులు’ అంటూ అవమానకరంగా చిత్రీకరించడం దారుణమన్నారు. కోవిడ్‌ సమయంలోనూ, ఆ తర్వాత ప్రజలకు సచివాలయ ఉద్యోగులు అందించిన సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రెండున్నరేళ్లుగా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. జిఒ11తో ఉద్యోగులపై పనిభారం పెంచారని, అర్ధరాత్రి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు, సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సచివాలయాలపై మంత్రి డోలా బాల వీరాంజనేయులు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవాలు లేవన్నారు. ఎపిపిఎస్.సి గ్రూప్‌–1, ప్రస్తుత డిఎస్.సిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సిఐ అహ్మద్‌ అలీ మృతి పని ఒత్తిడి కారణంగానే జరిగిందని, దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన ఉద్యోగులపై కేసులు పెట్టడం సరికాదన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్