బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ జిల్లా అండర్ 17 ఫుట్బాల్ జట్టు ఘన విజయం

1 గంట క్రితం

విశాఖ జిల్లా అండర్ 17 ఫుట్బాల్ జట్టు ఘన విజయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఎస్.కే.వీ.టీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలురు, బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది.హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌ లో కర్నూలు జిల్లా జట్టుపై విశాఖ జిల్లా జట్టు 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌షిప్ కప్‌ ను కైవసం చేసుకుంది.కోచ్ రాజేంద్ర కుమార్ శిక్షణలో, జట్టు సారథి కోలా భాగ్యేష్ నాయకత్వంలో విశాఖ టీం సమిష్టిగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇది విశాఖ జట్టుకు వరుసగా మూడో విజయం కావడంతో హ్యాట్రిక్ విజయంగా నిలిచింది.ముఖ్య అతిథి, కాకినాడ రీజినల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బి. జాన్సన్ చేతుల మీదుగా జట్టు సారథి కోలా భాగ్యేష్ విజేత ట్రోఫీని అందుకున్నారు.ఈ సందర్భంగా కోచ్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం మన్నారు క్రీడలు శారీరక దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవసరమైన క్రమశిక్షణను నేర్పుతాయి. యువ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.విశాఖ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి హ్యాట్రిక్ విజయాలు అందించినందుకు గాను కోచ్ రాజేంద్ర కుమార్‌ ను విశాఖ జిల్లా డీఈఓ ప్రేమ్ కుమార్, ఎస్.జి.ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వర్మలు అభినందించారు. విజేతలకు ప్రముఖులు క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్