శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు చాగల్లు విద్యార్థులు

1 గంట క్రితం

రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు చాగల్లు విద్యార్థులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు

చాగల్లులోని జడ్ పి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ జె.విజయలక్ష్మి తెలిపారు. ఈనెల  1న దేవరపల్లి జపి ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్-14 ఫుట్ బాల్ బాలికల జిల్లా స్థాయి పోటీల్లో చాగల్లు జడ్.పిహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారన్నారు. దీంతో బి.కౌసల్య, పి.యామిని, డి.జయదుర్గ, ఇ.నందిని, ఎస్.పావని, కె.శ్రీవిద్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 24 నుంచి 26 వరకు రంపచోడవరంలో జరుగుతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు హెచ్ఎం ఎస్.వాసవి అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్