గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంటల తీరుపై పరిశీలన

1 గంట క్రితం

పంటల తీరుపై పరిశీలన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్

​జిల్లాలోని తొర్రేడు, కాతేరు, బలభద్రపురం, బిక్కవోలు, లోళ్ల, వెంకటాపురం, కొప్పవరం తదితర ప్రాంతాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సంరక్షణ, నష్ట నివారణ, తిరిగి పంటలను పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.అధ్యాపకులు, విద్యార్థులను బృందాలుగా విభజించి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పంటల పరిస్థితిని అంచనా వేశారు. పంటలను తిరిగి కోలుకునేలా చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి, వాటిని అమలు చేయాలని రైతులకు సూచించారు తుపాను ప్రభావంతో వరి పంటతో పాటు ఉద్యాన పంట అయిన అరటి కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కెవి.రమణమూర్తి మాట్లాడుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగల పంట రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో తుపాను నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో పంటల పరిస్థితిని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తగిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ పర్యటనలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ప్రవీణ, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ విజయకృష్ణ, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనూష, డాక్టర్ సునీత, డాక్టర్ విశాలాక్షి దేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్