ప్రజాశక్తి-దేవరాపల్లి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని దేవరాపల్లి ఎస్.ఐ. వి. సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ అనంతరం ఎవరూ అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని, బాణసంచా కాల్చడం, డీజేలు వినియోగించడం నిషేధమని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా గుమిగూడరాదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)