మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిమోనియా నివారణపై అవగాహనా సదస్సు

5 రోజుల క్రితం

నిమోనియా నివారణపై అవగాహనా సదస్సు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 04:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అనపర్తి

మండలంలోని రామవరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో బుధవారం నిమోనియా నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యాధికారులు ప్రజలకు వివరించారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించి చిన్నారులలో దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం, చాతి లోపలికి వెళ్లడం, పాలు తాగకపోవడం వంటి లక్షణాలను ముందుగానే గుర్తించాలని తెలిపారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి, పరిస్థితి తీవ్రంగా ఉంటే 108 అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రి లేదా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడం ద్వారా మరణాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఆరు నెలల వయసు వరకు శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, పిసిబి టీకా మూడు డోసులు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. తల్లులు పరిశుభ్రత పాటిస్తూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పొగ మరియు కాలుష్యం నుండి పిల్లలను దూరంగా ఉంచితే నిమోనియా బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తిస్తే చిన్నారుల ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కె.మీనాక్షిదేవి, ఎంపిహెచ్ఇఒ సిహెచ్. శ్రీనివాస్, సూపర్‌వైజర్ పి.శ్రీనివాసరావు, ఎంఎల్‌హెచ్‌పి జి.లోకేశ్వరి, ఎఎన్ఎం టి.జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్