ప్రజాశక్తి - అనపర్తి
అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిబిఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి ఎం.వంశీకృష్ణ మాట్లాడుతూ చిన్నారులు, విద్యార్థులపై వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టం పటిష్టంగా పని చేస్తుందని అన్నారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, సెల్‌ఫోన్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా పోలీసు, న్యాయ సేవాధికార సంస్థల సహాయం పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టివివి.రమణమూర్తి, న్యాయవాదులు నల్లమిల్లి వినూరెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ అబ్బాయిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)