మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు....

3 రోజుల క్రితం

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

ఈ నెల 14 నుంచి ప్రారంభమైన 59వ,జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కపిలేశ్వరపురం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దానేటి శివకుమారి ఆధ్వర్యంలో ముగింపు సభను నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వంగా శ్రీనివాస్, పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు . ఈ వారం రోజులు పాటు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన క్విజ్, తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, జ్ఞాపికలను అందించారు. హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గ్రంథాలయాలును విద్యార్దులకు పరిచయం చేయాలనే సదుద్దేశంతోనే గ్రంథాలయ వారోత్సవాలు, వేసవి శిక్షణ శిబిరాలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించి, వారిని భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఏసు రత్నం, చిట్టూరి నాగేంద్రప్రసాద్, గ్రంథాలయ పాలకురాలు డి.శివకుమారి, రూతు రత్నమణి భ్రమరాంబ, గ్రంథాలయ పాలకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్