మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు

3 రోజుల క్రితం

గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చాగల్లు : చాగల్లు శాఖా గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయాల వారోత్స ముగింపు సభను నిర్వహించారు. తహశీల్దార్ ఎం.కమల్ సుందర్ చాగల్లు మండలం ఎంఇఒలు జె.సత్యానంద్, హెచ్.శుభకర్, తాళ్లూరు వెంకట రామారావు, డాక్టర్ ఆలపాటి సాంబశివరావు, దొడ్డ వెంకట్రావు, రాజరాజేశ్వరి విద్యాలయ డైరెక్టర్ వి.వెంకట రామారావు పాఠకులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చే అలవాటును నిత్య కృత్యంగా మార్చుకోవాలన్నారు. ఎంఇఒ1 సత్యానంద్ మాట్లాడుతూ మేధావులందరూ గ్రంథాలయ పఠనంతోనే గొప్పవారయ్యారన్నారు. ఎంఇఒ 2 శుభకర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ పుస్తకాలను, పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం గ్రంథ పాలకురాలు సిహెచ్ వెంకట జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్