మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం : డిఇఒ

3 రోజుల క్రితం

పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం : డిఇఒ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-దేవరాపల్లి

ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని బేతపూడి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని శుక్రవారం డిఇఒ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థినులు సాధిస్తున్న ప్రగతిని తెలుసుకున్నారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మెళకువలను స్వయంగా బోర్డుపై బోధిస్తూ పలు సూచనలు చేశారు. సబ్జెక్టుల వారీగా సులభంగా ఎక్కువ మార్కులు సాధించే విధానాలను వివరించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి వివి.ఈశ్వరరావు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్