ప్రజాశక్తి – యానాం
గౌతమ బుద్ధుని బోధనలు సమాజానికి ఔషధాల వంటివని, అవి ప్రపంచ శాంతికి బాసటగా నిలుస్తాయని త్రిరత్న బౌద్ధ ధమ్మ సొసైటీ యానాం అధ్యక్షులు పొనుగుమట్ల విష్ణుమూర్తి పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ నగర్‌లోని దీన పోషక సమాజం వద్ద సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విష్ణుమూర్తి మాట్లాడుతూ మానవతా విలువలు, సమానత్వం, శాంతి మార్గాన్ని బోధించే బౌద్ధ ధమ్మాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పి.నరసింహమూర్తి, నామాడి అప్పారావు, నామాడి స్వరాజ్యలక్ష్మి, గిడ్ల వీరవరప్రసాద్, గుత్తాల శ్రీరాములు, జక్కల ప్రసాద్, గుర్రపు ప్రహ్లాదుడు, తాటిపాక దుర్గబాబు తదితరులు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు, పంచశీలాలు, బౌద్ధ ధమ్మ విధివిధానాలు, ధమ్మపదం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో పంతగాడ సూర్యనారాయణ, తిరుకోటి వెంకట్రావు, పాలికి జానకి, పంతగడ సత్యనారాయణమ్మ, బచ్చల దేవి, మహిళా మండలి సభ్యులు, బౌద్ధ ఉపాసకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)