శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

06 ఆగస్టు, 2026

gnt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజుపాలెం : మాదక ద్రవ్యాలతో అన్ని అనర్ధాలే జరుగుతాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాంబాబు నాయక్ అన్నారు. గురువారం ఆకుల గణపవరం హైస్కూల్ విద్యార్థులకు మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు, మాదక ద్రవ్యాలవల్ల కలిగే ప్రమాదాలు , దాని పర్యవసానాల గురించి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వల్ల శారీరక, మానసిక , సామాజిక దుష్ప్రభావాల గురించి వివరించారు. ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత భవిష్యత్తును ఎంపిక చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిషేధానికి అందరూ సహాకారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రబాబు, ఆరోగ్య పర్యవేక్షకులు జీవనరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అలేఖ్య, ఉపాధ్యాయులు తోట శ్రీనివాసరావు, ఏ.ఎన్. ఎమ్. లు కమల, ప్రమీల బాయ్, ఆశా కార్యకర్తలు దీవిన, అనురాధ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్