ప్రజాశక్తి - వినుకొండ(పల్నాడు జిల్లా) : ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకువచ్చిన 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వినుకొండ దస్తావేజులు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమం బుధవారం 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దస్తావేజులేఖర్లు బిక్షాటన చేశారు. పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నుండి నరసరావుపేట రోడ్డులో శివయ్య స్తూపం సెంటర్ జూనియర్ కాలేజీ సెంటర్ మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమం కొనసాగింది. ప్రదర్శన చేపట్టి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారు. 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని, దస్తావేజులేఖర్ల వృత్తిని కాపాడుకోవాలని, దస్తావేజు లేక రోడ్డుపాలు చేయొద్దని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలంటూ నినాదాలు చేశారు. ''అయ్యా ముఖ్యమంత్రి గారు.. మా వృత్తని కాపాడండి'' అంటూ దస్తావేజులేఖర్లు బిక్షాటన చేశారు. అనంతరం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహంకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా దస్తావేజు లేఖరుల వృత్తిని కాపాడేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు.
వినుకొండలో దస్తావేజులేఖర్ల భిక్షాటన
22 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)