బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెల్త్ హాస్పిటల్‌లో క్యాథ్ ల్యాబ్, కార్డియాక్ ఐ.సి.యు ప్రారంభం

14 ఆగస్టు, 2026

Cath Lab and Cardiac ICU inaugurated at Health Hospital.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : అన్నింటా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెనాలి హెల్త్ హాస్పిటల్ లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రకాశం రోడ్డులోని హెల్త్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్, కార్డియాక్ ఐ.సి.యు ప్రారంభోత్సవంతో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలు, అత్యవసర గుండె చికిత్స సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ .... గుండె సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో వైద్యం అందించడం అత్యంత కీలకమని, తెనాలి ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన కార్డియాక్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన హెల్త్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, మేనేజింగ్ డైరెక్టర్ మన్నే హరీష్ ను అభినందించారు. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అవసరమైన వైద్య సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దానికి హెల్త్ హాస్పిటల్ బృందం శ్రీకారం చుట్టిందన్నారు. నూతన క్యాథ్ ల్యాబ్ ద్వారా గుండెకు సంబంధించిన వివిధ వైద్య పరీక్షలు, అవసరమైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని, కార్డియాక్ ఐ.సి.యు ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు నిరంతర పర్యవేక్షణతో వైద్య సేవలు అందించవచ్చన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం కూడా ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని సూచించారు. క్యాథ్ ల్యాబ్, కార్డియాక్ ఐ.సి.యు సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, మేనేజింగ్ డైరెక్టర్ మన్నే హరీష్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రమణ్యం, డాక్టర్ ఆవుల చక్రవర్తి, పలువురు వైద్యులు, హాస్పిటల్ వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్